సుశాంత్ మరణం వెనుకున్న మాస్టర్ మైండ్స్ పేర్లను రియా బయటపెట్టాలి: కంగన 

  • రియాను బలిపశువును చేస్తారనే విషయాన్ని ముందు నుంచి చెపుతున్నా
  • విచారణలో అన్ని విషయాలను రియా బయట పెట్టాలి
  • మాస్టర్ మైండ్ల పేర్లను వెల్లడించాలి
డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్టు తేలడంతో బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కాసేపటి క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రియాను బలిపశువును చేస్తారనే విషయాన్ని తాను ముందు నుంచి చెబుతూనే ఉన్నానని తెలిపింది.

ఆమె డబ్బు కోసం మగాళ్లతో స్నేహం చేసే మహిళే కావచ్చు... ఆమె డ్రగ్స్ తీసుకునే ఉండొచ్చు... కానీ, విచారణలో అన్ని విషయాలను నిర్భయంగా బయటపెట్టాలని వ్యాఖ్యానించింది. సుశాంత్ మరణం వెనుకున్న మాస్టర్ మైండ్స్ పేర్లను ఆమె వెల్లడించాలని కంగన చెప్పింది. సుశాంత్ సినిమాలను లాక్కున్న వ్యక్తులు ఎవరు? అతనికి డ్రగ్స్ ఇచ్చింది ఎవరు? అతని కెరీర్ ను నాశనం చేయాలని అనుకున్నది ఎవరు? అనే విషయాలను రియా బయటపెట్టాలని తెలిపింది.

Kangana Ranaut
Rhea Chakraborty
Bollywood

More Telugu News